పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రిలీజ్ అయినప్పుడు నాన్ రిఫండబుల్ రేట్స్ కింద బయర్స్ భారీ రేట్లు పెట్టి కొనడానికి భయపడి అడ్వాన్స్ బేస్ మీదే భారీ రేట్లు ఇచ్చి సినిమాను రిలీజ్ చేశారు…. దాంతో మేకర్స్ భారం మొత్తం తమ మీదే వేసుకుని…
సినిమాను రిలీజ్ చేశారు….సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా ప్రమోషన్స్ ఏమి కూడా లేక పోవడంతో సినిమా వాల్యూ టార్గెట్ 372 కోట్ల మార్క్ ని ఎంతవరకు అందుకుంటుందో అన్న అనుమానాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బరిలోకి దిగింది….ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ బ్రేక్ ఈవెన్ ని దాటాకపోవడం కూడా…
అందరిలో కొంచం డౌట్స్ కలిగేలా చేసినా కూడా ఒక్క సారి ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కల్కి మూవీ నిరూపించి లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాహుబలి తర్వాత బెస్ట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ప్రభాస్ కెరీర్ లో…
భారీ లాభాలను సొంతం చేసుకుని 1000 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…సినిమా ఇప్పుడు 27 రోజులు పూర్తి అయ్యే టైంకి వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్ల మీద ఏకంగా 150 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ ఎలాంటి హాలిడేస్ లేకుండా రిలీజ్ అయిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 150 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను అందుకుని ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు లాభాల లెక్కని పెంచుకుంటుందో చూడాలి.