బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార సినిమా ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ టైం లో టాలీవుడ్ లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేక పోవడంతో ఈ సినిమా పై భారీ ప్రెషర్ ఏర్పడింది. 2 నెలలుగా వరుస పెట్టి సినిమాలు అన్నీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో బింబిసార సినిమా అందరిలోనూ ఆశలను రేకెత్తించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
జస్ట్ హిట్ అయినా చాలు అని అందరూ అనుకున్నారు. ఇదే రోజున బింబిసారతో సీతా రామం కూడా రిలీజ్ అవ్వగా రెండూ కూడా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హిట్స్ గా నిలిచాయి. కానీ 2 సినిమాల్లో బింబిసార….
బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.2 కోట్లు కాగా సినిమా హిట్ అయితే చాలు అనుకుంటే లాంగ్ రన్ లో ఏకంగా ఆ టార్గెట్ కి డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఏకంగా 16.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. మూడో వీకెండ్ లో కూడా పెద్దగా పోటి ఇచ్చే కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో ఈ వీకెండ్ లో హోల్డ్ చేస్తే లాభాలు మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ కి 2 నెలలుగా ఎదురు చూస్తున్న హిట్ మూవీస్ కొరత తీరిపోగా…
జస్ట్ వారం గ్యాప్ లోనే ఒకటి కి మించి ఒకటి మూడు డిఫెరెంట్ జానర్ కి సంభందించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకుని దుమ్ము లేపాయి. ఇక లాంగ్ రన్ లో బింబిసార ఇంకా ఎంత దూరం వెళ్ళగలుగుతుందో చూడాలి ఇక.