రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ జాతర ను సృష్టిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) రెండు వారాలను పూర్తి చేసుకున్న తర్వాత మూడో వీక్ లో దసరా పండగ అడ్వాంటేజ్ తో ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 208.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 411.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక 16వ రోజు దసరా పండగ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా…
తెలుగు రాష్ట్రాల నుండే ఇప్పుడు 5.3-5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను సైతం మించిపోయే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా…
లిమిటెడ్ థియేటర్స్ లోనే రన్ అవుతూ ఉండగా 1.2-1.5 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 16వ రోజు వరల్డ్ వైడ్ గా 6.7-7 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 214 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 418 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను సైతం సినిమా మించి పోవచ్చు. ఇక టోటల్ గా 16 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.