Home న్యూస్ 16వ రోజు మాస్ రచ్చ చేసిన లక్కీ భాస్కర్….16 డేస్ టోటల్ కలెక్షన్స్!

16వ రోజు మాస్ రచ్చ చేసిన లక్కీ భాస్కర్….16 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

రిమార్కబుల్ కలెక్షన్స్ తో 2 వారాలను కంప్లీట్ చేసుకున్న తర్వాత మూడో వీక్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోవడంతో మళ్ళీ దీపావళి మూవీస్ జోరు చూపించడం మొదలు పెట్టగా దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) సినిమా…

మూడో వీకెండ్ లో మళ్ళీ రచ్చ చేయడం మొదలు పెట్టింది. సినిమా 16వ రోజు 15వ రోజు మీద మంచి గ్రోత్ ని చూపించింది…. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 16వ రోజు ఓవరాల్ గా 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది సినిమా…

ఇక సినిమా 15వ రోజు మీద ఎక్స్ లెంట్ గ్రోత్ ని వరల్డ్ వైడ్ గా కూడా చూపించిన సినిమా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది… శని ఆదివారాల్లో సినిమా మరింత జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంది.

Lucky Baskhar Movie 16 Days Total WW Collections

ఇక మొత్తం మీద సినిమా 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Lucky Baskhar Movie 16 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 8.61Cr~
👉Ceeded: 2.54Cr~
👉Andhra: 7.72Cr~
AP-TG Total:- 18.87CR(31.45Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 3.87 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో దుమ్ము లేపింది సినిమా…

ఇక సినిమా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Lucky Baskhar Movie 16 Days Total World Wide Collections Approx
👉Telugu States – 31.45Cr
👉Kerala – 18.90Cr
👉Karnataka – 5.40Cr
👉Tamilnadu – 12.15Cr
👉ROI – 1.95Cr
👉Overseas – 26.00Cr***approx
Total WW collection – 95.85CR(46.95CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 18.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన వీకెండ్ లో ఏ రేంజ్ లో సినిమా రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

Lucky Baskhar Movie 15 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here