బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలే రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్న వేల ఈ సంక్రాంతికి తమిళనాడులో పెద్ద సినిమాలు ఏమి కూడా రిలీజ్ కాక పోవడంతో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రూపొంది రిలీజ్ ఆగిపోతూ వచ్చిన విశాల్(Vishal) నటించిన మధ గద రాజ సినిమా డీసెంట్ రిపోర్ట్ లను సొంతం చేసుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఇప్పుడు…తమిళనాడులో ఈ సినిమా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా విశాల్ కెరీర్ లో మార్క్ అంథోని సినిమా తర్వాత సెకెండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది.
సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు పూర్తి అవ్వగా తమిళనాడులో సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కూడా తమిళనాడులో పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయి…
కానీ అదే టైంలో విశాల్ ఓల్డ్ మూవీ ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఈ రేంజ్ లో రచ్చ చేయడం విశేషం కాగా ఇప్పటికీ తమిళనాడులో లిమిటెడ్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా ఓవరాల్ గా…
52.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఈ వీకెండ్ లో సినిమా తెలుగు లో రిలీజ్ కాబోతూ ఉండటంతో ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయితే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంత లేట్ గా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం….