సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ లో దుమ్ము లేపుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 17 వ రోజు మరో సారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది అని చెప్పాలి… సినిమా 16 వ రోజు లెవల్ లో మరో సారి సాలిడ్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 20% వరకు డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకున్నా….
మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 2.8 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు 10 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది, ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు…
మొత్తం మీద ఇండియా లో ఈ రోజు సినిమా 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా మొత్తం మీద మరోసారి 10.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతరని తలపించేలా రెచ్చిపోయిన సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ తో మూడో వీకెండ్ ని ఇప్పుడు పూర్తీ చేయబోతుంది… ఇక ఓవరాల్ గా మూడో వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో లేక ఇంకొంచం మించే అవకాశం ఏమైనా ఉంటుందో చూడాలి…