టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. టెంపర్ నుండి నాన్ స్టాప్ గా 5 సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని సాగిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్. ఆర్ ఆర్ కోసం….
టోటల్ ఇండియా వైడ్ సినీ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన కి అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది అని గట్టిగానే అంటున్నారు. దాంతో పాటు సినిమా బడ్జెట్ కూడా భారీ లెవల్ లో ఉండబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. సుమారు 180 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుందని వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుండగా…
యూనిట్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా కి అంత బడ్జెట్ అనేది అబద్దమని తేల్చి చెప్పారట. సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదని, కంప్లీట్ అయ్యాక సినిమా కథ ని బట్టి పాన్ ఇండియా నా లేక తెలుగు వరకు మాత్రమేనా అన్నది చెప్పగలం అని వారు చెప్పినట్లు లేటెస్ట్ సమాచారం…
దాంతో ఇప్పటికిప్పుడు ఈ సినిమా గురించిన తర్వాత అప్ డేట్స్ ఉండక పోయినా ఎన్టీఆర్ పుట్టిన రోజు వరకు సినిమా టైటిల్ ఏంటి, తెలుగు మాత్రమేనా లేక పాన్ ఇండియా మూవీ నా లాంటి విశేషాలు రివీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20 వరకు ఎదురు చూపులు కొనసాగించాల్సిందే అని చెప్పొచ్చు.