Home న్యూస్ 1945 మూవీ రివ్యూ….ఏంటి సామి ఇది!!

1945 మూవీ రివ్యూ….ఏంటి సామి ఇది!!

0

రానా దగ్గుబాటి ఎప్పుడో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఒప్పుకున్న మూవీస్ లో 1945 సినిమా ఒకటి, సినిమా నిర్మాణంలో భాగంగా నిర్మాతతో వచ్చిన భేదభావాల వలన సినిమా నుండి మధ్య లోనే తప్పుకున్న రానా దగ్గుబాటి తర్వాత సినిమా ను అస్సలు పట్టించుకోలేదు, ఆ సినిమా ఆల్ మోస్ట్ 5 ఏళ్ల క్రితమే పూర్తీ అయ్యి మూడేళ్ళుగా రిలీజ్ కి నోచుకోక ఎట్టకేలకు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది… మరి సినిమా ఎలా ఉందంటే…

కథ పాయింట్ విషయానికి వస్తే 1945 టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని అన్ని విధాలుగా ఆధిపత్యం చూపిస్తున్న టైం లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీని స్థాపించాలని నిర్ణయం తీసుకుంటాడు, అదే టైం లో బర్మాకి ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకోవడానికి వెళ్ళిన హీరో ఆ ఊర్లో బ్రిటీష్ వాళ్ళ దగ్గర తహసీల్దారుగా పనిచేసే…

నాజర్ కుమార్తె రేజినాతో నిశ్చితార్థం జరిగిన తర్వాత తాను వద్దు అనుకున్నా బ్రిటిష్ వాళ్ళతో పోరాటానికి దిగాల్సి వస్తుంది. ఇక తర్వాత ఏమయింది అన్నది సినిమా మిగిలిన కథ. కథ పాయింట్ ఓవరాల్ గా కొంచం బాగానే ఉన్నా సినిమా టేకింగ్ విజువల్స్ అండ్ గ్రాండియర్ కూడా బాగున్నా కానీ….

అసలు తెరకెక్కించిన విధానం, డైరెక్షన్ అతి పేలవంగా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా చివరి వరకు కూర్చునేలా చేయలేక పోయింది, రానా ఉన్నంతలో బాగానే చేసినా రెజీనా, నాజన్, సత్యరాజ్, సప్తగిరిలు పర్వాలేదు అనిపించినా కానీ అసలు డైరెక్షన్ వీక్ గా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకోలేదు. సహనానికి పరీక్ష పెడుతూ సాగిన స్క్రీన్ ప్లే లో..

అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహా సినిమాలో అసలు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు, ఇక అన్నింటికన్నా బ్లండర్ క్లైమాక్స్ అనేది లేకుండా వాయిస్ ఓవర్ తో పూర్తీ చేసి నిరాశ పరిచారు… సినిమా రిచ్ గా ఉన్నా గ్రాండియర్ బాగున్నా కథని కరెక్ట్ గా చెప్పకపోతే అన్నీ వృధానే అవుతాయి అన్నదానికి 1945 సినిమా ఉదాహరణ…. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 1.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here