మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ బరిలో మూడో వారం లో ఉండగా మూడో వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, తెలుగు వర్షన్ వరకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మిగిలిన వర్షన్స్ అన్నీ కలిపి చూస్తె మాత్రం ఇది ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. కాగా సినిమా 18 వ రోజు తో పోల్చితే
బాక్స్ ఆఫీస్ దగ్గర 19 వ రోజు ఆదివారం అవ్వడం తో మంచి జోరునే కనబరించింది, 18 వ రోజు కన్నా 19 వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 30% వరకు గ్రోత్ కనిపించగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.. మరి కొన్ని చోట్లా 70% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అయింది సైరా సినిమా.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే సినిమా కి చివరి బెస్ట్ రోజు గా చెప్పుకోవచ్చు… వచ్చే వారం లో దీపావళి వీకెండ్ లో డబ్బింగ్ మూవీస్ దాటి తో థియేటర్స్ ని 80% కోల్పోబోతుంది సైరా నరసింహా రెడ్డి సినిమా, దాంతో ఆ వీకెండ్ సినిమా ఇదే విధంగా రెచ్చి పోయే అవకాశం తక్కువ.
ఉన్నంతలో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరుగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పొచ్చు.. మిగిలిన చోట్ల రన్ దాదాపు పూర్తీ కాగా…
కర్ణాటక మరియు ఓవర్సీస్ లో చాలా లిమిటెడ్ కలెక్షన్స్ తో కలిపి సినిమా 19 వ రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఫైనల్ లెక్కలు ఎంతవరకు వేలతాయో చూడాలి… కొద్ది సేపట్లో అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చాక టోటల్ 19 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ని అప్ డేట్ చేస్తాం.