యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసు కునేలా ఉందని చెప్పాలి.. ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడం మెల్లగా తగ్గించారు. సంక్రాంతి మూవీస్ కూడా స్లో అయినా కొత్త సినిమా లను కూడా పెద్దగా పట్టించు కోవడం లేదు ఆడియన్స్.
దాంతో ఆ ఇంపాక్ట్ కూడా పడి ‘అశ్వథ్థామ’ సినిమా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడగా సినిమా ఫస్ట్ డే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 15% లోపు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 25% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా యావరేజ్ గానే ఉండగా ఓవరాల్ గా ఈ రిపోర్ట్స్ ప్రకారం సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల రేంజ్ నుండి 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా పూర్తీ ఆఫ్ లైన్
టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ మరింత ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు… బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు. మొత్తం మీద సినిమా మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ ని అందుకోబోతుంది.
సినిమాను టోటల్ గా 6.5 కోట్ల రేంజ్ లో అమ్మారు… దాంతో మొత్తం మీద 7.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి రానున్న రోజుల్లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అన్న దానిపై ఈ బ్రేక్ ఈవెన్ ఆధారపడి ఉంటుంది. ఇక మొదటి రోజు అఫీషియల్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూడాలి.