బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ అక్కి నేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మార్నింగ్ షోల నుండే…
గ్రోత్ ని చూపుతూ 50% టు 55% వరకు బుకింగ్స్ ని ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి ఆ గ్రోత్ 70 టు 75% వరకు వెళ్ళడం విశేషం, కొన్ని సెంటర్స్ లో అయితే బుకింగ్స్ 85% వరకు వెళ్ళడం సాలిడ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
ఇవన్నీ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కాగా ఆఫ్ లైన్ కూడా సినిమా ఇదే విధంగా జోరు చూపిందని చాలా సెంటర్స్ రిపోర్ట్స్ అందాయి. దాంతో ఈ లెక్కల ప్రకారం సినిమా ఇప్పుడు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే..
అవకాశం అయితే ఉందని చెప్పోచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కంప్లీట్ లెక్కలు లేవు కాబట్టి ఈ లెక్క మరింత పెరగడమో లేక కొంచం తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
సినిమాను వరల్డ్ వైడ్ గా 33.10 కోట్లకు అమ్మడంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 34 కోట్లు కావాలి, అందులో భారీ మొత్తం మొదటి రోజే రికవరీ కానుండగా వీకెండ్ మొత్తం ఇదే రేంజ్ లో కుమ్మితే సినిమా చాలా వరకు బిజినెస్ ని రికవరీ చేయోచ్చు. ఇక మొదటి రోజు అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.