నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిగా షాక్ ఇచ్చాయి. నాని రీసెంట్ మూవీస్ తో పోల్చితే బుకింగ్స్ చాలా స్లో గా స్టార్ట్ అయ్యాయి, దాంతో మొదటి రోజు సినిమా 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు అని అంతా అనుకున్నారు, కానీ రిలీజ్ రోజున సినిమా జోరు చూపుతూ దూసుకు పోయింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ కన్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు అందుకుని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ 40% వరకు ఓవరాల్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి 60% కి పైగా పెరిగింది. పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు తెలియాల్సి ఉండగా…
వాటిని… ఓవరాల్ గా జరిగిన ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె మొదటి రోజు 4 కోట్ల కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని తేలింది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ పక్కగా ఉంటె మొదటి రోజు 4.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
ఇక్కడ గ్రోత్ బాగానే ఉన్నా ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయం లో సినిమా 0.18 మిలియన్ ప్రీమియర్ షో కలెక్షన్స్ తో ఓపెన్ అయింది. నాని కెరీర్ లో ఇది మరీ అద్బుతం కాకున్నా డీసెంట్ కలెక్షన్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక్క చోటే నాని ఇతర సినిమా రేంజ్ లో…
ఓపెనింగ్స్ రాలేదు… కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో జోరు చూపి నాని స్టార్ పవర్ ని చూపించింది గ్యాంగ్ లీడర్ సినిమా…ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందటం తో ఇక సినిమా లాంగ్ రన్ లో జోరు చూపే అవకాశం ఉంది, వీకెండ్ బ్యాటింగ్ గట్టిగా చేస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.