మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గద్దల కొండ గణేష్ లాంటి హిట్ మూవీ తర్వాత ఆల్ మోస్ట్ రెండున్నర తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ గని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ లో అంతగా బజ్ ఏర్పడలేదు అయినా కానీ సినిమా కి అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ జరిగింది…. ఏకంగా 26 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన గని సినిమా ఓపెనింగ్స్ పరంగా బిలో పార్ ఓపెనింగ్స్ నే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి… రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా కన్నా కొంచం బెటర్ గా తొలిప్రేమ సినిమా కన్నా…
చాలా తక్కువగా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా రోజు మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా లెక్కలు కొంచం ఎక్కువగా ఉంటే 2.5 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది కానీ…
సినిమా ఈ మార్క్ ని అందుకోవాలి అనుకున్నా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకున్నా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఈ రేంజ్ కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం లేదని చెప్పాలి… సినిమా మొదటి రోజు…
5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ మినిమమ్ అందుకుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కానీ మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఈ కలెక్షన్స్ అయితే అసలు సరిపోవు. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.