విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, ఉన్నంతలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ముందు కొద్దిగా స్లో గానే మొదలు అయినా..
తర్వాత పుంజుకుని మొదటి షో ముందు వరకు 50% లోపు బుకింగ్స్ ని సొంతం చేసుకోగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి మొత్తం మీద సినిమా 55% వరకు ఆక్యుపెన్సీ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీ జోరు అందుకుంటూ దూసుకు పోతుండటం విశేషం.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో ఓవరాల్ గా మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ ని వసూల్ చేసే చాన్స్ ఉంది, సినిమా మల్టీ ప్లేక్సులలో ఎలా జోరు చూపుతుందో సింగిల్ స్క్రీన్స్ లో కూడా అదే రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుండటం విశేషం.
దాంతో సినిమా జోరు రోజు మొత్తం ఇలాగే కొనసాగితే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ లెక్కలు పూర్తిగా అనుకున్న రేంజ్ లో ఉంటె ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి.
మొత్తం మీద మొదటి రోజు సినిమా కలెక్షన్స్ అన్ని సెంటర్స్ లో డీసెంట్ నుండి సూపర్బ్ గా ఉండే అవకాశం అయితే ఎంతైనా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ క్రేజ్ దృశ్యా వీకెండ్ లో సినిమా సాలిడ్ బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉంది, ఇక మొదటి రోజు డే ఎండ్ సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.