శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ ని సొంతం చేసుకుంది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అవ్వడం చాలా స్లో గా ఓపెన్ అయినా కానీ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో మ్యాట్నీ షోల నుండే జోరు పెంచడం మొదలు పెట్టగా ఈవినింగ్ నైట్ షో లకు వచ్చేసరికి సాలిడ్ గా ట్రెండ్ ని కొనసాగించి సత్తా చాటుకుంది.
మొత్తం మీద 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అని భావించగా అనుకున్నట్లుగానే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 4.07 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. అందులో 65 లక్షల హైర్స్ ఉండటం విశేషం.
మొత్తం మీద టికెట్ హైక్స్ మిగిలిన సినిమాల కన్నా ఎక్కువ థియేటర్స్ ఉండటం ఈ సినిమా కి కలిసి వచ్చింది. ఇక ఓవర్సీస్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన సినిమా అక్కడ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, దాంతో అక్కడ కలెక్షన్స్ తగ్గగా వరల్డ్ వైడ్ గా మొదటి 4.29 కోట్ల షేర్ ని అందుకుంది.
మొత్తం మీద మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.08Cr
👉Ceeded: 72L
👉UA: 54L
👉East: 44L(12L Hires)
👉West: 27L(12L Hires)
👉Guntur: 65L(41L Hires)
👉Krishna: 23.10L
👉Nellore: 14L
AP-TG Total:- 4.07CR (6.85Cr Gross~)(65L Hires)
Ka+ROI – 10L
OS – 12L
Total World Wide: 4.29CR( 7.30CR~ Gross)
సినిమాను టోటల్ గా 17.1 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 17.5 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా మరో 13.21 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది, అంటే వీకెండ్ మొత్తం ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.