తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూర్య కూడా ఒకరు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస పెట్టి ఫెల్యూర్స్ ని సొంతం చేసుకుంటూ తన మార్కెట్ ని కోల్పోతూ వచ్చిన సూర్య రీసెంట్ టైం లో చేసిన సూరరై పోట్రు మరియు జై భీమ్ లాంటి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్స్ గా నిలవగా….
ఇప్పుడు సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఈటీ తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే సారి రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ ముందే ఓపెన్ అయినా కానీ సూర్య నటించిన ఇది వరకు సినిమాల….
బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే వీక్ ఓపెనింగ్స్ నే ఈ సినిమా సొంతం చేసుకుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి 10-15% ఆక్యుపెన్సీ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కి ఓవరాల్ గా 20% ఆక్యుపెన్సీ రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉండగా…..
మొత్తం మీద ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 80 లక్షల రేంజ్ నుండి 85 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకోవచ్చు… ఇక తమిళనాడు లో సినిమా మొదటి రోజు 8-10 కోట్ల రేంజ్ లో….
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. కానీ సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు నుండి రాధే శ్యామ్ నుండి తీవ్రంగా పోటి ని ఎదురు కోబోతుండగా కలెక్షన్స్ ఎంతవరకు హోల్డ్ చేసి టార్గెట్ ను అందుకుంటుంది అన్నది ఆసక్తికరం… ఇక మొదటి రోజు కి గాను సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…