ఇతర భాషల్లో తన మార్కెట్ ఎక్స్ పాన్షన్ తో పాటు భారీ బ్లాక్ బస్టర్ కొడతానని భారీ ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అతి కష్టం మీద ముగించింది, సినిమా కలెక్షన్స్ వీకెండ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కానీ వర్కింగ్ డేస్ విషయానికి వచ్చే సరికి పూర్తిగా తేడా కొట్టింది, డే 5 నుండి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో సినిమా ఫ్లో మొత్తం దెబ్బ తిన్నది.
మొత్తం మీద మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
Nizam: 6.58Cr
Ceded: 1.19Cr
UA: 1.64Cr
Krishna: 0.77Cr
Guntur: 1.12Cr
West: 0.90Cr
East: 1.33Cr
Nellore: 0.53Cr
AP/TG Share – 14.06Cr
Karnataka: 1.40Cr
Tamil: 1.02Cr
Kerala: 0.54Cr
ROI: 0.36Cr
OS: 3.05Cr
1st Week WW Share: 20.43Cr
సినిమాను టోటల్ గా 34.6 కోట్లకు అమ్మగా 35.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 15.17 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తుండగా సినిమా టోటల్ రన్ ని ఈ రెండో వీకెండ్ ముగిసే లోపే పూర్తి చేసేలా ఉందని అంటున్నారు.
దాంతో సినిమా ఎంతలా ప్రేక్షకులను నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు. నైజాం వరకు ఎంతో కొంత లిమిటెడ్ కలెక్షన్స్ ని అయినా సాధించిన ఈ సినిమా టోటల్ ఆంధ్రా లో 7 వ రోజు కేవలం 2 లక్షల షేర్ ని అందుకుంది. అక్కడే సినిమా ఫేట్ కన్ఫాం అయ్యింది.
మిగిలిన చోట్ల మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేస్తుంది అనుకున్న సినిమా ఎంత పబ్లిసిటీ చేసినా తమిళ్ కేరళలో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది. మొత్తం మీద ఇప్పుడు ఫైనల్ రన్ ని 21 కోట్ల లోపే ముగించబోతుంది ఈ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.