అసలే హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది అనుకుంటే మెసేజ్ థీమ్ తో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి రివ్యూలు లభించాయి. యావరేజ్ గా 3 స్టార్ రేటింగ్ వరకు రేటింగ్ లను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు ఓపెనింగ్స్ మొదట్లో చాలా స్లో గా ఉన్నప్పటికీ ఈవినింగ్ నైట్ షోలలో పుంజుకుని మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ రెండో రోజు నుండి…
సినిమా ఎందుకనో కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఈ సినిమా. వీకెండ్ ని చాలా నీరసంగా ముగించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింతగా స్లో డౌన్ అయ్యింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేదు.
మొత్తం మీద ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉంది, 7 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 16 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుని భారీగా నష్టపోయింది. సినిమా ఇక మొత్తం మీద 7 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.73Cr
👉Ceeded: 1.57Cr
👉UA: 1.16Cr
👉East: 72L
👉West: 49L
👉Guntur: 96L
👉Krishna: 49L
👉Nellore: 32L
AP-TG Total:- 8.44CR (14.20Cr Gross~)
Ka+ROI – 27L( updated )
OS – 42L
Total World Wide: 9.13CR( 15.50CR~ Gross)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
సినిమాను టోటల్ గా 17 కోట్లకు అమ్మగా సినిమా 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, సినిమా మొదటి వారం పూర్తీ అయిన తర్వాత మరో 8.37 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది అసాధ్యం కాబట్టి ఇక సినిమా మరో భారీ డిసాస్టర్ గా శర్వానంద్ కెరీర్ లో నిలవడం ఇక ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది అని చెప్పాలి.