చాలా టైం తర్వాత ఆడియన్స్ ముందుకు తన డైరెక్షన్ లో సినిమా చేసిన కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) యుఐ మూవీ(UI Movie) లాస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా కన్నడలో పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
మిగిలిన చోట్ల మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ లో సినిమా కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది సినిమా…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 3.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 3.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 1.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి.
ఇక సినిమా కర్ణాటకలో ఓకే అనిపించే కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
UI Movie 7 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 28.10Cr
👉Telugu States – 3.90Cr
👉ROI – 0.80Cr
👉Overseas – 1.80Cr***approx.
Total WW collection – 34.60CR(16.80CR~ Share) Approx.
ఇదీ మొత్తం మీద సినిమా 7 రోజులలో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా క్లీన్ హిట్ కోసం ఇంకా 18 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…ఇక సినిమా టార్గెట్ ను అందుకునే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి.