Home న్యూస్ గీతాంజలి మళ్ళీ వచ్చింది 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

గీతాంజలి మళ్ళీ వచ్చింది 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

0

తెలుగు హీరోయిన్ అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi 1st Day Collections) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. ఎప్పుడో అరిగిపోయిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పుడు ఈ జానర్ ని చూడటానికి…

ఆడియన్స్ పెద్దగా ఆసక్తిని అయితే చూపించడం లేదు, కానీ రీసెంట్ టైంలో సరైన హర్రర్ కామెడీ ఏమి రాకపోవడం ఈ సినిమా కొంచం కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా సినిమా కి జనాలు థియేటర్స్ కి వచ్చారు. దానికి తోడూ సినిమా రంజాన్ పండగ హాలిడే లో…

రిలీజ్ అవ్వడంతో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ సొంతం అవ్వగా మొదటి రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ అయిన సెంటర్స్ ను బట్టి 55-60 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుంది…

వర్త్ షేర్ అటూ ఇటూగా 35-40 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ గానే రిలీజ్ చేశారు…వాల్యూ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత మాస్ సెంటర్స్ లో జనాలను థియేటర్స్ కి రప్పించే అవకాశం కొద్ది వరకు ఉంది. మరి వీకెండ్ లో ఓవరాల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here