Home న్యూస్ 1st డే ఆపరేషన్ వాలెంటైన్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ ఓపెనింగ్స్!

1st డే ఆపరేషన్ వాలెంటైన్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ ఓపెనింగ్స్!

0

రీసెంట్ టైంలో వరుసగా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి టాక్ అనుకున్న రేంజ్ లో రాలేదు…

దాంతో ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపించగా ఓపెనింగ్స్ పరంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ చేసింది, మొదటి రోజు ట్రాక్ చేసిన గ్రాస్ కలెక్షన్స్ కోటి రేంజ్ దాకా ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సినిమా సొంతం చేసుకుందని అంచనా….

Operation Valentine 1st Day Box Office Collections Report
కొన్ని చోట్ల డెఫిసిట్ లు కూడా జనాలు లేక సొంతం చేసుకుంది సినిమా… ఓవరాల్ గా షేర్ అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో ఉంటుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 20 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 58 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో రిపోర్ట్ అయ్యాయి…

దాంతో కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ షేర్ అటూ ఇటూగా 40 లక్షల లోపు ఉంటుంది. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉండగా సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

దాంతో సినిమా మొదటి రోజే మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 9.8 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు హోల్డ్ ని చూపించగలుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here