Home న్యూస్ రవితేజ ఈగల్ OTT రెస్పాన్స్….ఊహించిందే జరిగిందిగా!!

రవితేజ ఈగల్ OTT రెస్పాన్స్….ఊహించిందే జరిగిందిగా!!

1

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) ఆడియన్స్ ముందుకు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవ్వగా సినిమా కి రిలీజ్ టైంలో పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది అని చెప్పాలి.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న సినిమా ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది…అమెజాన్ ప్రైమ్ లో అలాగే ఈటీవీ విన్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంది అన్నది ఆసక్తి గా మారగా…

Raviteja Eagle 5 Days Total WW Collections!

సినిమా కి ఊహించినట్లే డిజిటల్ రిలీజ్ లో సినిమా కి సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వినిపిస్తుంది అని చెప్పాలి…సినిమాలో రవితేజ ఎలివేషన్స్ కానీ మాస్ సీన్స్ కానీ ఓవరాల్ క్వాలిటీ కానీ ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి ఇప్పుడు…

కొన్ని చోట్ల సినిమా డ్రాగ్ అయినట్లు అనిపించినా కానీ రీసెంట్ టైంలో రవితేజ నుండి వచ్చిన సినిమాల్లో క్రాక్, ధమాకా లాంటి సినిమాల తర్వాత బెస్ట్ మూవీ ఇదేనన్న టాక్ అయితే ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి. అన్ సీజన్ లో రిలీజ్ అవ్వకుండా మంచి హాలిడేస్ ఉన్న టైములో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే…

కచ్చితంగా ఆడియన్స్ ను సినిమా బాగా ఆకట్టుకుని ఉండేదని అంటున్నారు, కానీ అన్ సీజన్ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన మేర రెస్పాన్స్ సినిమాకి సొంతం అవ్వలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో ఊహించినట్లే సినిమాకి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పొచ్చు.

Raviteja Eagle 4 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here