Home గాసిప్స్ ఈ బడ్జెట్ ఏంటి….ఆ క్వాలిటీ ఏంటి….అరాచకం సామి!

ఈ బడ్జెట్ ఏంటి….ఆ క్వాలిటీ ఏంటి….అరాచకం సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) మూవీ….ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి వెళ్ళిపోగా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి…

ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా క్వాలిటీ పరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు అనిపించింది ట్రైలర్ చూస్తుంటే….ఆ రేంజ్ క్వాలిటీ అంటే సినిమా ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిందో అని అందరూ అనుకుంటూ ఉండగా క్రౌడ్ ఫండింగ్ తో సినిమా…

నిర్మాణం ఆల్ మోస్ట్ 5 ఏళ్లకు పైగా జరిగిందని సమాచారం, ఓవరాల్ గా బడ్జెట్ రేంజ్ 12-15 కోట్ల దాకా ఉంటుందని అంచనా…అందులో కూడా షూటింగ్ ఖర్చు తక్కువే అని అంటున్నారు, కానీ ఎక్కువ రోజులు షూటింగ్ జరుగుతూ ఉండటం వలన బడ్జెట్ కొంచం పెరిగి ఉండొచ్చు అని అంటున్నారు…

అయినా కూడా ఆ బడ్జెట్ మీద ఎన్నో రెట్లు ఎక్కువ క్వాలిటీతో సినిమా ట్రైలర్ మెప్పించిన విధానం చూస్తుంటే బడ్జెట్ కి మించి ఎన్నో రెట్లు ఔట్ పుట్ ట్రైలర్ లోనే కనిపిస్తూ ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here