ఈ సమ్మర్ కి ఆడియన్స్ ముందుకు వచ్చే వచ్చిన సినిమాల్లో ప్రస్తుతానికి ఒకే ఒక్క బిగ్ మూవీగా మారిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie 1st Day Collections) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది…
బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద ట్రేడ్ లో భారీ ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ రేంజ్ తో పోల్చినా అలాగే విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ తో పోల్చినా కూడా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా జోరు అనుకున్న స్థాయిలో అయితే లేదని చెప్పాలి.
ఫ్యామిలీ ఆడియన్స్ తో ఈవినింగ్ అండ్ నైట్ షోలు కొద్ది వరకు జోరు కనిపించింది, దాంతో అప్ కమింగ్ డేస్ లో సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు కాపాడుతారో చూడాలి. ఇక ప్రస్తుతానికి ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ముందు అనుకున్నట్లే….
4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క 6 కోట్లు ఆ పైనకి పెరిగే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 283K డాలర్స్ ను అందుకున్న సినిమా డే 1 కలెక్షన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద…
మొదటి రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 8-8.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం కనిపిస్తుంది… అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉండగా సినిమా ఈ అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక….