బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు సినిమాలకు సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar TRP Rating)…డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా….
మాస్ రచ్చ చేసి లాంగ్ రన్ లో సూపర్బ్ లాభాలను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పరుగును పూర్తి చేసుకుంది, క్లాస్ కంటెంట్ తోనే వచ్చినా కూడా దీపావళి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గ జోరుని చూపించి…
అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి 110 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా….
రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది…స్టార్ మా ఛానెల్ లో మంచి ప్రమోషన్స్ ను సొంతం చేసుకున్న సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ లో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో సినిమాలకు పెద్దగా రేటింగ్ లు ఏమి రావడం లేదు…
అలాంటిది లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 8.48 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది….రీసెంట్ గా టెలికాస్ట్ అయిన కల్కి మూవీ టి.ఆర్.పి జీ తెలుగు లో నిరాశ పరిచింది. కానీ లక్కీ భాస్కర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని టెలివిజన్ లో కూడా కుమ్మేసే రేటింగ్ ను అందుకుంది.