Home న్యూస్ ప్రతినిధి2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ప్రతినిధి2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా గ్యాప్ వచ్చిన హీరోలలో నారా రోహిత్(Nara Rohit) ఒకరు అని చెప్పాలి. సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకుని తను తీసిన కొన్ని మంచి సినిమాలలో ఒకటైన ప్రతినిధి సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie Review) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే నిజాలను ఎలాంటి భయం లేకుండా చెప్పే జర్నలిస్ట్ అయిన హీరో తన పనిలో బిజీగా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ ఆఫీసులో జరిగిన దాడిలో మరణిస్తాడు…ఆ దాడి వెనక ఉన్నది ఎవరు, మరణించిన ముఖ్యమంత్రి నిజంగానే చనిపోయాడా లేదా…. ఈ మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది కథ పాయింట్….

కథ పరంగా చాలా థిన్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా స్టార్ట్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా స్టార్ట్ అయినా కూడా చాలా వరకు కథ ఆడియన్స్ ప్రిడిక్ట్ చేసిన విధంగానే ఉండగా ఫస్టాఫ్ వరకు ఎలాగోలా యావరేజ్ గా అనిపించిన సినిమా డైలాగ్స్ వరకు కొన్ని ఆలోచించేలా చేసి మెప్పించినా కూడా స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది.

ఇక సెకెండ్ ఆఫ్ కథ చాలా వరకు స్లో నరేషన్ తో సాగగా అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నా కూడా ఓవరాల్ గా చాలా వరకు ప్రిడిక్ట్ చేసేలా బోర్ అనిపించేలా సినిమా సాగుతుంది. కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ తన వరకు బాగా నటించగా తన డైలాగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు…

సంగీతం ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయి….కొత్త డైరెక్టర్ మూర్తి దేవగుప్తపు డీసెంట్ పాయింట్ నే ఎంచుకుని లావిష్ గా సినిమాను తీసినా కూడా కొన్ని చోట్ల ఓవర్ ది టాప్ అనిపించేలా ఉండటం, కథ డ్రాగ్ అవ్వడంతో పడుతూ లేస్తూ సాగిన ప్రతినిధి2 పొలిటికల్ నేపధ్యంలో సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి…

కొంచం ఓపిక పట్టి చూస్తె యావరేజ్ గా అనిపించవచ్చు, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా బిలో యావరేజ్ గా అనిపించవచ్చు…. కానీ మొత్తం మీద నారా రోహిత్ నుండి ఎక్స్ పెర్ట్ చేసిన నికార్సయిన కంబ్యాక్ మాత్రం ప్రతినిధి2 సినిమా కాదని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here