కోలివుడ్ స్టార్ హీరో సూర్య పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది… ఒకప్పుడు ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సూర్య ఇప్పుడు కనీస ఓపెనింగ్స్ ని కూడా అందుకోలేక పోతున్నాడు, మీడియం రేంజ్ కాదు అప్ కమింగ్ హీరోల రేంజ్ కలెక్షన్స్ ని కూడా ఇక్కడ అందుకోలేక పోతున్నాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ తెలుగు లో మొదటి రోజు 1.8 కోట్ల రేంజ్ వసూళ్లు అందుకుంటుంది అనుకుంటే…
కేవలం 1.02 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఓ 70 లక్షల షేర్ ని అయినా సాధిస్తుంది అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ కేవలం 28 లక్షల షేర్ ని మాత్రమె అందుకుంది దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది, సినిమా రెండో రోజు కలెక్షన్స్ గ్యాంగ్ లీడర్ 9 వ రోజు…
కలెక్షన్స్ కన్నా తక్కువ ఉన్నాయి…. ఒక కొత్త సినిమా కలెక్షన్స్ 9 రోజుల పాత సినిమా కలెక్షన్స్ అంత కూడా కలెక్ట్ చేయకపోవడం విచారకరం అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది.
కానీ సినిమా ను రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 9 కోట్లకు అమ్మారు, అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 10 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, రెండు రోజుల్లో అతి కష్టం మీద 1.3 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మిగిలిన రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…
మరో 8.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది దాదాపు అసాధ్యం కాగా సగం బిజినెస్ అయినా రికవరీ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న గా మారిపోయింది, సరైన సినిమా లు ఎంచుకోవడం వల్ల ఇప్పుడు సూర్య టోటల్ మార్కెట్ ని కోల్పోయే స్టేజ్ కి వచ్చేశాడు. మరి ఫ్యూచర్ లో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.