బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని మినిమమ్ బజ్ కూడా క్రియేట్ చేయకున్నా కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరు మీద భారీ బిజినెస్ నే సొంతం చేసుకుంది. సినిమా 25.3 కోట్ల రేంజ్ బిజినెస్ తో 26.30 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే కంప్లీట్ గా ట్రాక్ తప్పింది అని చెప్పాలి…
ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ను అందుకునే రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోలేక పోయిన మొదటి రోజే కలెక్షన్స్ పరంగా కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేయగా రెండో రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గ్రోత్ ని చూపెట్టాల్సిన…
అవసరం ఉండగా సినిమా రెండో రోజు 1.3 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా రెండో రోజు అందులో సగం కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది సినిమా తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండో రోజు కేవలం 72 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచింది…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 1.10cr
👉Ceeded: 36L
👉UA: 49L
👉East: 24L
👉West: 17L
👉Guntur: 22L
👉Krishna: 22L
👉Nellore: 14L
AP-TG Total:- 2.94CR(5.35CR~ Gross)
👉KA+ROI: 0.20Cr
👉OS – 0.25Cr
Total WW: 3.39CR(Gross- 6.35CR~)
ఇదీ మొత్తం మీద సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 26.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 2 రోజుల కలెక్షన్స్ తర్వాత 22.91 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు అని చెప్పాలి.