మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 2.01 కోట్ల షేర్ ని సాధించగా అందులో సీడెడ్ లో రిపోర్ట్ అయిన హైర్స్ 11 లక్షలతో కలిపి 26 లక్షల దాకా హైర్స్ యాడ్ అవ్వగా అవి తీసేస్తే షేర్ 1.75 కోట్ల దాకా వచ్చింది. ఇక రెండో రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా బాగానే హోల్డ్ చేసినా కానీ ఓవరాల్ గా బాగానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు తో పోల్చితే 30% వరకు డ్రాప్ అయ్యింది ఈ సినిమా, ఆ విధంగా సినిమా జానర్ దృశ్యా బాగానే కుమ్మింది కానీ ఓవరాల్ గా బిజినెస్ లెక్క ప్రకారం చూసుకుంటే…
ఈ స్పీడ్ ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 1.24 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక మొత్తం మీద 2 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 97L
👉Ceeded: 67L
👉UA: 45L
👉East: 23L
👉West: 24L
👉Guntur: 29L
👉Krishna: 23L
👉Nellore: 17L
AP-TG Total:- 3.25CR(5.40CR~ Gross)
Ka+ROI: 18L
OS – 28L
Total WW: 3.71CR(6.50CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమా ను మొత్తం మీద 13.6 కోట్లకు అమ్మగా….
1.6 కోట్ల రిఫండబుల్ అగ్రిమెంట్ మీద అమ్మారు… ఓవరాల్ గా 14 కోట్లు అందుకోక పొతే ఆ మొత్తం వెనక్కి ఇవ్వాలి… 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 10.29 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు కవర్ చేయగలుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి.