Home న్యూస్ సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ కలెక్షన్స్….డే 2 కూడా ఊరమాస్ కలెక్షన్స్!

సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ కలెక్షన్స్….డే 2 కూడా ఊరమాస్ కలెక్షన్స్!

0

 మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రెండో రోజు కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ప్రస్తుత పరిస్థితులలో మొదటి రోజు నెట్టుకు వచ్చినా రెండో రోజు హోల్డ్ చేస్తుందో లేదో అన్న డౌట్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ గా హోల్డ్ చేసింది.

Solo Brathuke So Better 1st Day Total Worldwide Collections

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా ఆ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.9 కోట్ల షేర్ ని వసూల్ చేసి సత్తా చాటుకుంది. ఓవర్సీస్ లో పరిస్థితుల వలన స్లో అయిన సినిమా..

Solo Brathuke So Better 2 Days Total Worldwide Collections

వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండో రోజు రాబట్టింది. మొత్తం మీద రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 66L
👉Ceeded: 34L
👉UA: 32L
👉East: 14L
👉West: 8L
👉Guntur: 15L
👉Krishna: 13L
👉Nellore: 8L
AP-TG Total:- 1.90CR(3.30 Gross)
ఇదీ సినిమా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు…

ఇక సినిమా రెండు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 1.70Cr
👉Ceeded: 86L
👉UA: 72L
👉East: 40L
👉West: 26L
👉Guntur: 37L
👉Krishna: 26L
👉Nellore: 24L
AP-TG Total:- 4.81CR(8Cr+ Gross)
KA+ROI: 38L
Os: 26L
Total WW: 5.45Cr(9.1Cr Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రెండు రోజుల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా ను టోటల్ గా 9.2 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మొత్తం మీద 9.6 కోట్ల షేర్ ని…

కలెక్ట్ చేయాల్సి ఉండగా సినిమా ఇప్పటికే 5.45 కోట్ల షేర్ ని వసూల్ చేయగా టోటల్ గా మరో 4.15 కోట్ల షేర్ ని రాబడితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో రోజు ఆదివారం అవ్వడం తో ఈ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here