మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారలను పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి వారం పది రోజులు స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత సైరా ఎంట్రీ తో టోటల్ గా స్లో డౌన్ అయ్యింది. 12 వ రోజు నుండి సినిమా కి సింగిల్ డిజిట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయినా కానీ మేజర్ కలెక్షన్స్ ని…
సినిమా ఇప్పటి కే అందుకోగా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటి నుండి దసరా సెలవులు పూర్తీ అయ్యే సరికి మినిమం కలెక్షన్స్ తో రన్ అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.
ఇక సినిమా 2 వారాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 7.76Cr
?Ceeded: 3.41Cr
?UA: 2.52Cr
?East: 1.67Cr
?West: 1.40Cr
?Guntur: 1.78Cr
?Krishna: 1.39Cr
?Nellore: 82L
AP-TG Total:- 20.75Cr
Ka & ROI: 1.46Cr
OS: 1.78Cr
Total: 24.01Cr(37.65Cr Gross) ఇదీ 2 వారాల్లో సినిమా కలెక్షన్స్.
సినిమా ను టోటల్ గా 24.25 కోట్లకు అమ్మారు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 25 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా రెండు వారాల్లో సాధించిన 24.01 కోట్ల షేర్ కాకుండా సినిమా మరో 99 లక్షల వరకు షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది.
ఇక సినిమా మూడో వారం లో టోటల్ గా 160 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా తో పాటు కొత్త సినిమా చాణక్య కూడా ఉండటం తో ఈ వారం చాలా కీలకం అని చెప్పొచ్చు. ముందుగా చెప్పినట్లే మినిమం హోల్డ్ చేసినా కానీ సినిమా క్లీన్ హిట్ అవ్వడం ఖాయం.