బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ మూడో వారంలో మళ్ళీ మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతుంది..
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద సినిమా ఇప్పుడు 16వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు మరో మైలురాయి ని ఇక్కడ అధిగమించి రచ్చ చేసింది సినిమా…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో హిస్టారికల్ 200 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది. గ్రాస్ పరంగా కూడా సినిమా ఏకంగా 300 కోట్ల మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది….మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…
200 కోట్లకు పైగా షేర్ ని 300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకున్న మూడో సినిమాగా సంచలనం సృష్టించింది….ఇది వరకు బాహుబలి2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఈ మార్క్ ని దాటగా ఇప్పుడు ఈ మార్క్ ని అందుకున్న మూడో సినిమాగా నిలిచింది సినిమా…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 215 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు…ఇక ఈ వీకెండ్ తో పాటు క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేల వీకెండ్ ల మంచి జోరుని చూపిస్తే టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.