Home న్యూస్ 2005 లో వచ్చిన సినిమా కోసం 16 ఏళ్ల తర్వాత నిర్మాత-డైరెక్టర్ గొడవ!!

2005 లో వచ్చిన సినిమా కోసం 16 ఏళ్ల తర్వాత నిర్మాత-డైరెక్టర్ గొడవ!!

0

ప్రెజెంట్ సోషల్ మీడియా లో మోస్ట్ హ్యాప్పేనింగ్ టాక్ ఇది… కొత్త సినిమాల రైట్స్ కోసం అప్పుడప్పుడు అవి నావి నావి అంటూ గొడవలు పడటం మనం ఇది వరకు చూశాం కానీ ఇప్పుడు ఏకంగా 16 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా హక్కుల కోసం డైరెక్టర్ మరియు నిర్మాత మధ్య గొడవ జరుగుతుంది. ఇండియా లోనే వన్ ఆఫ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కి ఈ మధ్య వరుస అడ్డంకులు ఎదురు అవుతున్నాయి.

కోలివుడ్ వాళ్ళు ఎందుకనో శంకర్ పై గుర్రుగా ఉన్నారు. ఇండియన్ 2 సినిమాను పక్కకు పెట్టి వేరే సినిమాలు కమిట్ అవుతూ ఉండటం తో ఈ విషయం పై అదే టైం లో వరుస పెట్టి కంప్లైంట్స్ శంకర్ పై వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అపరిచితుడు సినిమాను….

హిందీ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టగా ఆ సినిమా నిర్మాత నుండి ఊహించని ఎదురుదెబ్బ శంకర్ కి తగిలింది. ఆ సినిమా హక్కులు అన్నీ నిర్మాతగా నేను సొంతం చేసుకున్నాని, నాకు తెలియకుండా ఎలా ఆ కథని రీమేక్ గా వాడుకుంటావని అంటూ శంకర్ పై కోపంగానే….

ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు ఆస్కార్ రవిచంద్రన్.. ఈ విషయం పై శంకర్ కూడా స్పందిస్తూ ఆ సినిమా కథ నాదని, నేను ఏ భాషలో అయినా రీమేక్ చేసుకునే అధికారం నాకుందని అంటూ శంకర్ కూడా ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో కొందరు ఇప్పుడు శంకర్ వైపు మరికొందరు నిర్మాత వైపు నిలబడి సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తం మీద ఫైనల్ గా ఎవరి నిర్ణయం కరెక్ట్ అనేది తెలియాల్సి ఉండగా శంకర్ మాటల ప్రకారం కథని అందించింది తానెనని కానీ కథ సహకారం చేసిన మరో వ్యక్తీ దగ్గర రైట్స్ అన్నీ తీసుకోవడం నిర్మాత తప్పు అంటున్నారు. ఈ విషయం పై ఆ టైం లో శంకర్ దగ్గర పనిచేసిన అసిస్టంట్ డైరెక్టర్స్ తో పాటు కొంతమంది క్రూ కూడా ఇప్పుడు శంకర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here