Home న్యూస్ విక్రమ్ – తంగలాన్ టీసర్ రివ్యూ…ఏంటి సామి ఈ అరాచకం!

విక్రమ్ – తంగలాన్ టీసర్ రివ్యూ…ఏంటి సామి ఈ అరాచకం!

0

చియన్ విక్రం(Chiyaan Vikram) విలక్షణ నటుడు, సినిమాలో ఎదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప సినిమా చేయడు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా సక్సెస్ అవుతూ ఉండగా… రీసెంట్ గా పోన్నియన్ సెల్వన్ సిరీస్ లో ముఖ్య భూమిక పోషించి మంచి క్రేజ్ ను తిరిగి సొంతం చేసుకోగా…

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విక్రం నటించిన కొత్త సినిమా అందరికీ మైండ్ బ్లాంక్ చేసేలా చేస్తుంది అని చెప్పాలి. కబాలి ఫేమ్ పా రంజిత్ డైరెక్షన్ లో విక్రం హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie) కంప్లీట్ గా రా రగ్గుడ్ మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది…

వచ్చే ఇయర్ జనవరి 26న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ చూసిన తర్వాత ఇంత రగ్గుడ్ కంటెంట్ చూసి అందరూ శాకవుతున్నారు అనే చెప్పాలి. విక్రం ఇంత రగ్గుడ్ రోల్ లో ఎవ్వరూ ఊహించి ఉండరు…

బాలా డైరెక్షన్ లో ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి, అలాంటిది పా రంజిత్ డైరెక్షన్ లో ఇలాంటి రగ్గుడ్ మాస్ కంటెంట్ ఓ వస్తున్న తంగలాన్ సినిమా టీసర్ లో డైలాగ్స్ ఏమి లేక పోయినా కూడా విజువల్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా మెప్పించగా…

ఇంత రగ్గుడ్ మాస్ మూవీని ఇక్కడ ఎలా ఆదరిస్తారో తెలియదు కానీ తమిళ్ లో మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టీసర్ చూసిన తర్వాత మాత్రం ఈ రేంజ్ రా కంటెంట్ ను అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here