2018 టాలీవుడ్ బెస్ట్ హీరోయిన్ ఎవరంటే??

6
340

       2018 ఇయర్ ఆల్ మోస్ట్ ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బెస్ట్ హీరో అండ్ బెస్ట్ మూవీ గురించిన స్పెషల్ ఆర్టికల్స్ ని ఇది వరకే పబ్లిష్ చేశాం. ఇక ఇప్పుడు 2018 ఇయర్ కి గాను టాలీవుడ్ లో బెస్ట్ హీరోయిన్ రేసులో నిలిచిన హీరోయిన్స్ కొందరు ఉండగా వారిలో టోటల్ గా ఈ ఇయర్ కి బెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసు కుందాం పదండీ..

ముందుగా రేసులో ఇయర్ స్టార్టింగ్ భాగమతి సినిమాతో మెప్పించిన అనుష్క ఆ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా నిలిచిన ఈ సినిమాలో అనుష్క నటన కి మంచి మార్కులు పడ్డాయి.

ఇక రంగస్థలం సినిమా తో కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సమంత ఆ సినిమా విజయం లో తానూ కూడా ముఖ్య భూమిక పోషించింది, ఇక తరవా యూ టర్న్ మూవీ లో కూడా తన నటనతో మెప్పించి ఈ ఇయర్ బెస్ట్ హీరోయిన్ రేసులో నిలిచింది.

ఇక ఛలో తో టాలీవుడ్ లో అడుగు పెట్టి తొలి సినిమాతోనే నటన తో మెప్పించిన రష్మిక తర్వాత గీత గోవిందం సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మెప్పించింది. క్లైమాక్స్ సీన్ లో రష్మిక పెర్ఫార్మెన్స్ కి అద్బుతమైన మార్క్స్ పడ్డాయి. దాంతో లిస్టులో చోటు దక్కించుకుంది రష్మిక.

ఇక RX100 సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన పాయల్ రాజ్ పుత్ తొలి సినిమా తోనే అందంతో అభినయం తో మెప్పించింది. క్లైమాక్స్ సీన్ లో తన నటన కి మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా తోనే వంక పెట్టని నటనతో మెప్పించి లిస్టులో చోటు దక్కించుకుంది పాయల్.

ఇక మిగిలిన హీరోయిన్స్ అరవింద సమేత లో పూజ హెడ్గే, భరత్ అనే నేను లో కియరా అద్వాని, తొలిప్రేమ సినిమాలో రాశిఖన్నా, అ! సినిమాలో కాజల్ అగర్వాల్, హలో గురు ప్రేమ కోసమే లో అనుపమ పరమేశ్వర్ మెప్పించినా కానీ…

సమ్మర్ లో వచ్చిన మహానటి తో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించడమే కాదు, స్వర్గీయ సావిత్రి గారి జీవిత చరిత్రని మరెవరు అంత పెర్ఫెక్ట్ గా చేయలేరు అనిపించే లెవల్ లో చేసి మెప్పించి ఈ ఇయర్ ఎలాంటి డౌట్ లేకుండా బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంది కీర్తి సురేష్.

దాంతో ఈ ఇయర్ కి ఎలాంటి డౌట్ లేకుండా కీర్తి సురేష్ బెస్ట్ హీరోయిన్ ఆఫ్ 2018 గా చెప్పుకోవచ్చు. సమంత కొంచం పోటి ఇచ్చేలా ఉన్నా కీర్తి సురేష్ ఫుల్ మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. మరి మీ ఓటు ఎవరికో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here