Home న్యూస్ 2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

5

      2018 ఇయర్ ఆల్ మోస్ట్ ఎండ్ కి వచ్చేయగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ప్రేక్షకుల ను ఆకట్టుకున్న సినిమాలు, ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమాలు, ఊహించని విజయాన్ని అందుకున్న సినిమాలు ఉన్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలు మాత్రమె ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సాన్ని సృష్టించి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటాయి. మరి ఆ బిగ్ ఓపెనింగ్స్ ఏవో తెలుసుకుందాం పదండీ.

టాప్1: అజ్ఞాతవాసి: ఈ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ తొలిరోజు జరిగిన బుకింగ్స్ హిస్టారికల్ లెవల్ లో ఉండటంతో రెండు రాష్ట్రాలలో 26.6 కోట్ల షేర్ ని అందుకోగా, ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 60.1 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

టాప్2: అరవింద సమేత: ఈ సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాలలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను 26.66 కోట్లతో అందుకుని చరిత్ర సృష్టించగా…ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి తో పోల్చితే ఆ సినిమా 1.5 మిలియన్ అందుకుంటే ఈ సినిమా 0.8 మిలియన్ అందుకోవడంతో 58 కోట్ల గ్రాస్ తో టాప్ 2 ప్లేస్ ని అందుకుంది.

టాప్ 3: భరత్ అనే నేను: సమ్మర్ లో వచ్చిన ఈ సినిమా రెండు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజు 23.5 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 55 కోట్ల గ్రాస్ ని అందుకుని ఈ ఇయర్ టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది.

టాప్ 4: సమ్మర్ లో వచ్చిన మొదటి పెద్ద సినిమా రంగస్థలం మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 19.71 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ సుమారు 44 కోట్ల రేంజ్ లో ఉంది…కానీ లాంగ్ రన్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

టాప్ 5: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా: సమ్మర్ ఎండ్ టైం కి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో మొదటి రోజు 16.3 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూపంలో 35 కోట్ల రేంజ్ లో అందుకుని టాప్ 5 లో నిలిచింది.

మొత్తం మీద ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనర్స్ గా నిలిచిన సినిమాలు ఇవి…మిగిలిన సినిమాలు ఏవి ఈ సినిమాల దరిదాపుల్లో కూడా లేవనే చెప్పాలి. ఇక ఈ లిస్టులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here