Home న్యూస్ 46 కోట్ల టార్గెట్…5 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

46 కోట్ల టార్గెట్…5 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

0

  కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత ని కొనసాగిస్తుంది. సినిమా 4 రోజుల్లోనే అల్టిమేట్ లెవల్ లో 75 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు క్రిస్టమస్ హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి కలెక్షన్స్ ఊచకోత కోసి దుమ్ము లేపే రేంజ్ లో ట్రెండ్ అయింది.

సినిమా టోటల్ గా 5 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… కర్ణాటకలో 60 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 7 కోట్లు, తమిళ్ లో 3.5 కోట్లు, కేరళలో 1.2 కోట్లు, హిందీ వర్షన్ కి గాను 21 కోట్లు మరియు ఓవర్సీస్ లో 3.2 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది.

దాంతో టోటల్ గా 5 రోజుల్లో 95.9 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించగా షేర్ సుమారు 50 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమచారం. దాంతో 46 కోట్ల టార్గెట్ ని 5 రోజుల్లో ఫినిష్ చేసి ప్రస్తుతానికి ఆల్ మోస్ట్ 4 కోట్ల లాభం తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here