మరి కొన్ని రోజుల్లో ఆల్ మోస్ట్ 5 నెలలు ఈ ఇయర్ కి గాను పూర్తీ కాబోతుండగా ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో కొన్ని పెద్ద సినిమాలు కొన్ని చిన్న సినిమాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలిచాయి… అందులో పెద్ద మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ ఒక్కటి మాత్రమే సూపర్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలవగా మిగిలిన పెద్ద సినిమాలు….
బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. మొత్తం మీద అన్ని సినిమాల్లో డబ్బింగ్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 తెలుగు వర్షన్ కింద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన….
సినిమాలలో హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… బంగార్రాజు సినిమా 39.15 కోట్ల షేర్ తో టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకోగా ఆచార్య సినిమా టోటల్ రన్ లో 48.36 కోట్ల షేర్ ని అందుకుని టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోగా ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా….
టోటల్ రన్ లో 83.20 కోట్ల షేర్ ని అందుకుని టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది… ఇక టాప్ 4 ప్లేస్ లో భీమ్లా నాయక్ సినిమా 97.63 కోట్ల షేర్ తో ఉండగా మూడో ప్లేస్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 102.65 కోట్ల షేర్ తో ఉండగా రెండో ప్లేస్ లో సర్కారు వారి పాట సినిమా 11వ రోజు కలెక్షన్స్ తో 103 కోట్లకు పైగా షేర్ తో నిలవబోతుంది.
ఇక మొదటి ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 609 కోట్లకు పైగా షేర్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్ లో కొనసాగుతుంది సినిమా…. ఇందులో కొన్ని సినిమాల రన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా ఈ ఇయర్ ఎండ్ వరకు ఇంకా ఎన్ని సినిమాలు భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తాయో చూడాలి.