బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా 20వ రోజులో అడుగు పెట్టిన సినిమా హిందీలో పర్వాలేదు అనిపిస్తూ ఉన్నా కూడా…
మిగిలిన చోట్ల మాత్రం భారీగానే స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇక సంక్రాంతి సినిమాల సందడి మొదలు కాబోతూ ఉండటంతో సలార్ ఇక పరుగు చివరి స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. ఉన్నంతలో సినిమా 20వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉండగా హిందీలో 50 లక్షల లోపు నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది, మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఓవరాల్ గా ఎండ్ స్టేజ్ కి వచ్చేశాయి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజు వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ నుండి 45 లక్షల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం ఉండగా గ్రాస్ 1 కోటి రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బిజినెస్ మార్క్ ని ఇక అందుకోవడం కష్టంగా కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 20 రోజుల బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…