వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇంకా సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఒక పక్క సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఇంకా అన్ని చోట్ల కంప్లీట్ గా తగ్గాల్సి ఉండగా మరో పక్క థార్డ్ వేవ్ కూడా అతి త్వరలో రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇలాంటి టైం లో థియేటర్స్ అన్ని చోట్ల తెరచు కోవడం సినిమాలు రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ ని సాధించడం అన్నది ఇంకా కష్టమే అని చెప్పాలి.
కానీ సెకెండ్ వేవ్ లో ఇక్కడ మన దగ్గర థియేటర్స్ అన్నీ మూత పడ్డ వేల కరోనా సృష్టికర్త అయిన చైనా లో మాత్రం హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.
సినిమా చైనా తో పాటు ఇతర దేశాల్లో చాలా లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్నా చైనా లో సాలిడ్ రిలీజ్ ను దక్కించుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము లేపింది. ఇక మొత్తం మీద రిలీజ్ అయిన చోట్ల సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అవ్వగా….
మొత్తం మీద సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైం కి $292,457,000 డాలర్స్ లెక్కలో కలెక్ట్ చేసి ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో భీభత్సం సృష్టించింది. మన లెక్కల్లో చెప్పాలి అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2166.5 వేల కోట్ల కలెక్షన్స్ ని ఫస్ట్ ఫేస్ రిలీజ్ లో సొంతం చేసుకుంది. ఇక సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఇండియా లో మిగిలిన అన్ని దేశాల్లో…
జూన్ 25 న రిలీజ్ అవ్వాల్సింది, ఇండియా లో ఇంకా పట్టేలా ఉండగా అమెరికాలో మాత్రం అనుకున్న టైం కే రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఆ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఇక ఇండియా లో సినిమా రిలీజ్ ను ఎప్పుడు ప్లాన్ చేస్తారో తెలియాల్సి ఉంది.