Home న్యూస్ 217CR కాంబో ఇది….ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే భీభత్సం!!

217CR కాంబో ఇది….ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే భీభత్సం!!

0

RRR మూవీతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారగా ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా ప్రామిసింగ్ గా ఉండటం విశేషం, రీసెంట్ గా RC16 ని మొదలు పెట్టగా ఇప్పుడు RC17 సినిమాను అనౌన్స్ చేశాడు….

దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారని చెప్పాలి. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న 3 సినిమాలు కూడా మోస్ట్ ప్రామిసింగ్ గా ఉండటంతో తన మార్కెట్ రేంజ్  మరింత పెరిగే అవకాశం ఉంది, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్(Game Changer Movie) తో ముందుగా రాబోతున్న రామ్ చరణ్ తర్వాత….

ఉప్పెన(Uppena Movie) డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో RC16 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో చేయబోతున్నాడు. ఇక ఇప్పుడు తనతో రంగస్థలం(Rangasthalam Movie) లాంటి ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీని తీసిన డైరెక్టర్ సుకుమార్(Sukumar) తో ఇప్పుడు RC17 మూవీని చేయబోతున్నాడు….

#RC16 Grand opening Tomorrow

రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి రేచ్చిపోగా టోటల్ రన్ లో ఏకంగా 217 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఆ టైంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది, ఆ సినిమా తర్వాత పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు సుకుమార్…

అలాంటి సుకుమార్ తో ఇప్పుడు రామ్ చరణ్ చేయబోతున్న అప్ కమింగ్ మూవీ కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలను మించిపోయేలా రూపొందించడం ఖాయమని చెప్పాలి. రామ్ చరణ్ నుండి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఇలాంటి లైనప్ కోసం ఎదురు చూడగా ఇప్పుడు అలాంటి కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తున్నాడు రామ్ చరణ్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here