బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఆల్ రెడీ రిలీజ్ అయ్యి 17 రోజులు కాగా 17వ రోజు సినిమా ఇండియాలో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పై ఏకంగా 10 రెట్లు గ్రోత్ ని చూపించి దుమ్ము దుమారం లేపింది. సినిమా 17వ రోజు కర్ణాటకలో 9.50 కోట్ల గ్రాస్ ను అందుకోగా…
తెలుగు లో 5.50 కోట్ల గ్రాస్ ను అందుకుంది, హిందీ లో 4.80 కోట్ల గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో 1.1 కోట్ల గ్రాస్ ను అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 17వ రోజు ఇండియాలో 22.50 కోట్ల గ్రాస్ ను అందుకుంది…
రిలీజ్ అయిన రోజు 2.6 కోట్ల గ్రాస్ ను ఇండియాలో అందుకోగా దానికి 10 రెట్లు ఎక్కువగా 17వ రోజు అందుకోవడం విశేషం. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజులో ఎంటర్ అవ్వగా సినిమా ఈ రోజు కూడా మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉండగా…
ఈ రోజు మొత్తం మీద 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల దాకా షేర్ ని అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆల్ రెడీ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా దీపావళి వరకు జోరు ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది.