టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృశ్యా పెద్ద సినిమాలు కొట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు. అలా౦టి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవ్వడం విషాదకరమే అయినా వాటి రిజల్ట్స్ ని ఎవ్వరు మార్చలేరు. టాలీవుడ్ లో ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ గా నిలిచిన టాప్ 20 సినిమాలు ఎవో చూద్దాం పదండి.
23. ఎన్టీఆర్ “రామయ్యావస్తావయ్యా”(2013):-
బాద్ షా లాంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త యాటిట్యూడ్ తో వచ్చిన రామయ్యావస్తావయ్యా అద్బుతమైన బిజినెస్ చేసింది…గబ్బర్ సింగ్ తో దుమ్ము లేపిన హరీష్ శంకర్ బాద్ షా హిట్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా అవ్వడం తో స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్టాఫ్ భీభత్సంగా ఉన్నా సెకెండ్ ఆఫ్ బొక్క బోర్లా పడటం తో డిసాస్టర్ గా ముగిలిపోయింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 40 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 54 కోట్లు
వచ్చిన మొత్తం:- 32 కోట్లు
టోటల్ లాస్:- 22 కోట్లు
22. వెంకటేష్ ”షాడో”(2013):-
విక్టరీ వెంకటేష్ మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో వచ్చిన షాడో సినిమా భారీ బడ్జెట్ తో రూపొందగా సినిమా ను టోటల్ గా 32.5 కోట్ల రేంజ్ లో అమ్మారు… ఆ టైం లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ కాగా సినిమా టోటల్ రన్ లో భారీ నష్టాలను సొంతం చేసుకుని డిసాస్టర్ గా మిగిలిపోయింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):-38 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 32.5 కోట్లు
వచ్చిన మొత్తం:- 10.10 కోట్లు
టోటల్ లాస్:- 22.40 కోట్లు
21. మహేష్ బాబు”ఆగడు”(2014):-
దూకుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఆగడు సినిమా మరోసారి దూకుడునే చూపించి మధ్యలో గబ్బర్ సింగ్ స్టైల్ ని కాపీ కొట్టడంతో ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో రిజల్ట్ తేడా కొట్టేసింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 48 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 56 కోట్లు
వచ్చిన మొత్తం:- 34 కోట్లు
టోటల్ లాస్:- 22 కోట్లు
20. బాలకృష్ణ “పరమ వీర చక్ర”(2011):-
10 ఏళ్ల తరువాత సింహా లాంటి భారీ విజయం సాధించిన బాలయ్య దాసరి నారాయణరావు గారి 150 వ సినిమాగా తెరకెక్కించిన పరమవీర చక్రలో నటించారు. సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల అయినా సినిమాలో సరుకు లేకపోవడంతో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా మిగిలింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 25 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 26 కోట్లు
వచ్చిన మొత్తం:- 3.80 కోట్లు
టోటల్ లాస్:- 22.20 కోట్లు
19. ఎన్టీఆర్ “శక్తి”(2011):-
మగధీర చూసిన దర్శకుడు మెహర్ రమేష్ అలాంటి సినిమాను తీయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అల్లుఅర్జున్ తో చేయాలని ట్రై చేసినా కుదరక ఎలాగోలా ఎన్టీఆర్ ని మభ్యపెట్టి చేసిన చిత్రం శక్తి. ఫస్టాఫ్ ఎంతోకొంత బాగుంది అనిపించినా సెకెండాఫ్ సినిమాకు పెద్ద మైనస్ గా మారి అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు చేశానా అని భాదపడుతూనే ఉన్నాడు.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 42 కోట్లు
వచ్చిన మొత్తం:- 19.50 కోట్లు
టోటల్ లాస్:- 22.50 కోట్లు
18. సాయి ధరం తేజ్ ”ఇంటెలిజెంట్”(2017):-
కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో దూసుకు పోయిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత ఒక్కసారిగా స్లో డౌన్ అయ్యాడు. సాయి ధరం తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మూవీ 27 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుని కేవలం 3.8 కోట్ల షేర్ ని అందుకుని ఏకంగా 23.2 కోట్ల లాస్ ని సొంతం చేసుకుంది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 20 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 27 కోట్లు
వచ్చిన మొత్తం:- 3.8 కోట్లు
టోటల్ లాస్:- 23.2 కోట్లు
17. నాగార్జున ”ఓం నమో వెంకటేశాయా”(2017):-
డివోషనల్ మూవీస్ చేయడం లో దిట్ట అయిన కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమా మంచి రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ బాక్స్ అఫీస్ దగ్గర కలెక్షన్స్ ని మాత్రం అందుకోలేక భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో కూడా భారీ నష్టాలు సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 25 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 33.6 కోట్లు
వచ్చిన మొత్తం:- 10 కోట్లు
టోటల్ లాస్:- 23.6 కోట్లు
16. పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు”(2017):-
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి 2017 లో వచ్చిన క్రేజీ మూవీ కాటమరాయుడు…మంచి రివ్యులనే తెచ్చుకున్న అమ్మిన బిజినెస్ ని వెనక్కి తీసుకురాలేక కమర్షియల్ గా బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా చేరింది. సినిమా 2017 ఇయర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాల జాబితాలో ముందు నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 30 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 87.5 కోట్లు
వచ్చిన మొత్తం:- 62.5 కోట్లు
టోటల్ లాస్:- 25 కోట్లు
15. రామ్ చరణ్ “బ్రూస్ లీ”(2015):-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కి భారీ బిజినెస్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి మెగా క్యామియో కూడా కారణం అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ వచ్చే వరకు సినిమాలో చలనం లేకపోవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయి డిసాస్టర్ గా మిగిలిపోయింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 50 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 65 కోట్లు
వచ్చిన మొత్తం:- 40 కోట్లు
టోటల్ లాస్:- 25 కోట్లు
14. రామ్ చరణ్ “తూఫాన్”(2013):-
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పుల్లో అలనాటి క్లాసిక్ జంజీర్ ని రీమేక్ చేయడం ఒకటి. హిందీతో పాటు తెలుగులో కూడా రూపొందించిన తూఫాన్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి డిసాస్టర్ అమ్మమొగుడుగా మిగిలిపోయింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 36.20 కోట్లు
వచ్చిన మొత్తం:- 11.20 కోట్లు
టోటల్ లాస్:- 25 కోట్లు
13. రామ్ చరణ్ “ఆరెంజ్”(2010):-
మగధీర లాంటి ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం సహజం. అలాంటి సమయంలో మాస్ స్టోరీ వద్దనుకున్న రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ఆరెంజ్ ఒక కొత్త అనుభూతిని మిగిలించిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం “ఓ రేంజ్” లో ఫ్లాఫ్ అయింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 46 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 46.50 కోట్లు
వచ్చిన మొత్తం:- 20.10 కోట్లు
టోటల్ లాస్:- 26.40 కోట్లు
12. రామ్ చరణ్ “వినయ విదేయ రామ”(2019):-
రంగస్థలం లాంటి ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం సహజం. అలాంటి సమయంలో మాస్ స్టోరీలకు పెద్దన్న లాంటి బోయపాటి తో చేసిన వినయ విదేయ రామ అంచనాలను పూర్తిగా తప్పి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 60 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 90 కోట్లు
వచ్చిన మొత్తం:- 63.4 కోట్లు
టోటల్ లాస్:- 26.60 కోట్లు
11. పవన్ కళ్యాణ్ “కొమురం పులి”(2010):-
ఖుషి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం మొఖం వాచి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి ఇచ్చిన దర్శకుడు ఎస్.జే.సూర్య తో చేతులు కలిపి చేసిన చిత్రం కొమురం పులి. భారీ అంచనాల నడుమ…భారీ అడ్డంకుల నడుమ విడుదల అయిన కొమురం పులి పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమాగా మిగలడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మారింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 45 కోట్లు
వచ్చిన మొత్తం:- 18.30 కోట్లు
టోటల్ లాస్:- 26.70 కోట్లు
10.అక్కినేని అఖిల్ “అఖిల్”(2015):-
అక్కినేని లెగసీలో 40 కోట్లకు పైగా కలెక్ట్ చేయగల సత్తా ఉన్న హీరో అఖిల్ ఒక్కడే అని భారీ ప్రమోషన్ మధ్యన వినాయక్ దర్శకత్వంలో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం అఖిల్. భారీ అంచనాల నడుమ దీపావళికి విడుదల అయిన అఖిల్ టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42.50 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 48.50 కోట్లు
వచ్చిన మొత్తం:- 20.20 కోట్లు
టోటల్ లాస్:- 28.30 కోట్లు
9. పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్”(2016):-
పవర్ స్టార్ పవన కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి 83.40 కోట్ల బిజినెస్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 89.60 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ రన్ లో 53 కోట్ల షేర్ వసూల్ చేసిన సర్దార్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 32 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 83.40 కోట్లు
వచ్చిన మొత్తం:- 52.60 కోట్లు
టోటల్ లాస్:- 37 కోట్లు
8. మహేష్ బాబు “బ్రహ్మోత్సవం”(2016):-
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ మూవీ బ్రహ్మోత్సవం ఇండస్ట్రీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ తెలుగు వర్షన్ కి 75.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో 36.80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దాంతో టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది.తమిళ్ డబ్బింగ్ వర్షన్ కి కూడా 12 కోట్ల బిజినెస్ చేసింది కానీ ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడ ఎలా కలెక్ట్ చేస్తుంది అనేదానికిపై ర్యాంక్ ఎంతో తెలుస్తుంది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 75.60 కోట్లు
వచ్చిన మొత్తం:- 36.80 కోట్లు,
టోటల్ లాస్:- 38.80 కోట్లు
7.మహేష్ బాబు “1 నేనొక్కడినే”(2014):-
సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేయాలి అని తపించిన సుకుమార్ అలాంటి ఆలోచనలతో చేసిన చిత్రం 1 నేనొక్కడినే. నటన పరంగా మహేష్ పీక్స్ లో నటించినప్పటికి సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలు ఒక్కటి కూడా లేకపోవడం సినిమా నిడివి సుమారు 3 గంటలవరకు ఉండటంతో టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది ఈ సినిమా.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 55 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 72 కోట్లు
వచ్చిన మొత్తం:- 29.30 కోట్లు
టోటల్ లాస్:- 42.70 కోట్లు
6. చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి”(2019):-
మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహా రెడ్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి 143 కోట్ల అంచనా బిజినెస్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 187.25 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ రన్ లో 143.8 కోట్ల షేర్ వసూల్ చేసిన “సైరా నరసింహా రెడ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 270 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 143కోట్లు~, టోటల్ 187.25 కోట్లు
వచ్చిన మొత్తం:- 143.80 కోట్లు
టోటల్ లాస్:- 43.45కోట్లు
5. బాలకృష్ణ “ఎన్టీఆర్ మహానాయకుడు”(2019):-
స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పార్ట్ మిగిలిన నష్టం 50 కోట్లను పూడ్చడానికి 51 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఊహకందని షాక్ ఇస్తూ తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 30 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 51 కోట్లు
వచ్చిన మొత్తం:- 3.78 కోట్లు
టోటల్ లాస్:- 47.22 కోట్లు
4. బాలకృష్ణ “ఎన్టీఆర్ కథానాయకుడు”(2019):-
స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఆశించిన కలెక్షన్స్ ని అందుకోలేక తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 50 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 70.5 కోట్లు
వచ్చిన మొత్తం:- 20.23 కోట్లు
టోటల్ లాస్:- 50.27 కోట్లు
3. ప్రభాస్ “సాహో”(2019):-
బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో ఫ్లాఫ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా 218 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది, కానీ అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువ అవ్వడం తో సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా చరిత్ర లో భారీ లాస్ లను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 350 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 270.6 కోట్లు
వచ్చిన మొత్తం:- 219 కోట్లు~
టోటల్ లాస్:- 52.15 కోట్లు
2. మహేష్ బాబు “స్పైడర్”(2017):-
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మురగదాస్ ల కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మురగదాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ ని ఓ సాదా సీదా హీరో గా చూపించడం ఎవ్వరికీ రుచించలేదు. దాంతో స్పైడర్ అంచనాలు తప్పి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ సినిమాగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 120 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 106.3 కోట్లు, తమిళ్ 18 కోట్లు=124.30 కోట్లు
వచ్చిన మొత్తం:- 63.8 కోట్లు
టోటల్ లాస్:- 60.50 కోట్లు
1. పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి”(2018):-
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకునే హీరో…అలాంటి హీరో నటించిన ప్రతిష్టాత్మక 25 వ అజ్ఞాతవాసి అంచనాలను భారీగా తప్పి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ సినిమాగా నిలిచింది.
సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 70 కోట్లు
అమ్మిన రేటు(అంచనా):- 123.6 కోట్లు
వచ్చిన మొత్తం:- 57.5 కోట్లు**
టోటల్ లాస్:- 66.1 కోట్లు
ఇవి కాకుండా ఆఫీసర్, నా నువ్వే లాంటి సినిమాలు చరిత్రలో నెగటివ్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలు గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేశాయి… ఇవీ మొత్తం మీద తెలుగు సినిమా చరిత్ర లోనే బిగ్గెస్ట్ లాస్ మూవీస్..…ఇంకా ఏవైనా సినిమాలు మిస్ అయ్యాయి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
Sahoo N0 1 flop
In telugu
180 cr sale rate
102 cr share only telugu
Loss 78
NTR 2 parts kalipi 71 cr business vachindi 24 cr so loss 71- 24 = 47 cr
part 1 loss became target for 2nd part….and 2nd part also became big flop…technically both movies became biggest flop movies
Bro Saaho world wide share is 232cr so loss is 38 cr
Radheshyam lo first place confirm
Arey katamarayudu 62 crore business collected 63 crore hit status evadu ra mimmalni channel cheyamandi
Katamarayudu flop 𝓑𝓻𝓸
Indulo son of india movie and mosagallu vunnanya?
budget wise mosagallu kuda untundi…but e list theatrical business lo top losses vachina movies
Where is son of India bro?? tollywood lo biggest disaster kadha??
Sir This is All time diasester list
AA be like:- Sorry I don’t have any interest on it 🤘🤘🤘
Please check with spyder tamil nadu share… Spyder grossed 11 cr in TN and you kept 12 cr as share…
Spyder tamil gross is around 25cr, and share is approx 12cr…..
King of indian cinema only Allu Arjun 🔥 thagedhe le ❤️
Radhe shyam Indian Epic Disaster
Radheshyaam, Bheemlanayak, Aacharya ,puspa, Gani etc…