Home గాసిప్స్ 22 కోట్ల సుడిగాడికి సీక్వెల్….అల్లరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్!

22 కోట్ల సుడిగాడికి సీక్వెల్….అల్లరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కామెడీ మూవీస్ తో తన కంటూ మంచి పేరు ను మార్కెట్ ను సొంతం చేసుకుని మినిమమ్ గ్యారెంటీ హీరో గా ఒకప్పుడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) కెరీర్ లో ప్రస్తుతం అనుకున్న రేంజ్ లో హిట్స్ పడటం లేదు, సీరియస్ సబ్జెక్ట్ అయిన నాందితో కంబ్యాక్ దొరికింది కానీ…

సీరియస్ మూవీస్ తో తన మార్కెట్ అయితే అనుకున్న రేంజ్ లో లేదు…ఇలాంటి టైంలో మళ్ళీ తన కొత్త సినిమా ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie) తో మళ్ళీ కామెడీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ రాబోతూ ఉండగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సుడిగాడు(Sudigadu Movie)…

రేంజ్ హిట్ ఎప్పుడు…ఆ సినిమా కి సీక్వెల్ చేయోచ్చు కదా అని అడిగిన ప్రశ్నకి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అల్లరోడు…ఆ సినిమా సీక్వెల్ కోసం సరైన కథ కోసం ట్రై చేసినా సెట్ అవ్వలేదని ఇది వరకు చెప్పగా ఇప్పుడు స్వయంగా తానె ఈ సినిమా సీక్వెల్ కథను రాస్తున్నానని…

వచ్చే ఏడాదికి కథ పూర్తి అవుతుంది అని అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో సెపరేట్ తెలంగాణా మూమెంట్ లో అంచనాలను మించి సుడిగాడు సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించి 22 కోట్ల రేంజ్ షేర్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…అల్లరి నరేష్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ను…

సొంతం చేసుకున్న సుడిగాడు సినిమా అంటే ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది…అలాంటి సినిమాకి సీక్వెల్ కోసం చాలా టైం నుండే ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు స్వయంగా అల్లరోడు సీక్వెల్ ను కన్ఫాం చేస్తూ వచ్చే ఏడాది ఆ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు వస్తుంది అని చెబుతూ ఉండటంతో ఇక ఆ సినిమాతో అల్లరోడు సాలిడ్ హిట్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here