Home న్యూస్ విశాల్ కి బంపర్ ఛాన్స్….అసలు పోటినే లేదు సామి!

విశాల్ కి బంపర్ ఛాన్స్….అసలు పోటినే లేదు సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ సీజన్ చాలా చప్పగా సాగుతుంది…టాలీవుడ్ నుండి సమ్మర్ లో టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఒక్కటి సాలిడ్ హిట్ కొట్టిన కూడా తర్వాత ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయాయి…మంజుమ్మేల్ బాయ్స్ హిట్ అయింది కానీ ఇతర మూవీస్ మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు.

ఇక సమ్మర్ కి అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఎలక్షన్స్ మరియు IPL మ్యాచులు ఎఫెక్ట్ వలన అన్ని సినిమాలు కూడా రిలీజ్ లను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఏప్రిల్ 25న లవ్ మీ, ప్రతినిధి2, అరణ్మాయి2 తెలుగు డబ్ మూవీ ఇలా అన్నీ కూడా ఈ వీకెండ్ నుండి పోస్ట్ పోన్ అయ్యాయి…

దాంతో ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రానున్న సినిమా ఒక్కటే నిలిచింది…ఆ సినిమానే విశాల్(Vishal) నటించిన రత్నం(Ratnam Movie) తెలుగు డబ్ వర్షన్ ఒక్కటే రిలీజ్ కానుంది… అసలు పోటినే లేకుండా ఈ సినిమా రిలీజ్ కానుంది…. తమిళ్ లో కూడా పెద్దగా పోటి లేదు…

ఇటు తెలుగు లో కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రత్నం లాంటి మాస్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి రత్నం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం ను చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here