Home న్యూస్ విజయ్ దేవరకొండ @ 249….దరిదాపుల్లో కూడా ఏ హీరో లేడు!!

విజయ్ దేవరకొండ @ 249….దరిదాపుల్లో కూడా ఏ హీరో లేడు!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మీడియం రేంజ్ హీరోలలో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా ప్రతీ సినిమాకి బిజినెస్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూనే ఉన్నాడు…. మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో కూడా బిజినెస్ ల పరంగా ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ దరిదాపుల్లో లేడనే చెప్పాలి ఇప్పుడు…

ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ సినిమాతో రచ్చ చేస్తున్నా కూడా క్లీన్ హిట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండకి ఇంకా సొంతం అవ్వడం లేదు… ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక విజయ్ దేవరకొండ లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 249 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం, టైర్ 2 హీరోల్లో 200 కోట్లకు పైగా బిజినెస్ ను 5 సినిమాలతో అందుకున్న ఒకే ఒక్క హీరోగా విజయ్ రికార్డ్ కొట్టాడు…

ఒకసారి విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#VijayDeverakonda Recent Movies WW Business
👉#FamilyStar – 43CR*******
👉#Khushi(2023) – 52.50CR
👉#Liger – 88.40CR
👉#WorldFamousLover – 30.50CR
👉#DearComrade – 34.60CR
👉#Taxiwala – 18CR
👉#NOTA- 25.50CR

లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఆల్ మోస్ట్ 249 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక సినిమా కి బిజినెస్ ఇప్పుడు 49.80 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. కానీ ఈ లిస్టులో ఒక్క సినిమా కూడా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని దాటలేక పోయింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ తో అయినా సాలిడ్ కంబ్యాక్ ను విజయ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here