Home న్యూస్ 24 గంటలు ఓవర్…రికార్డులు చెల్లాచెదురు సామి!

24 గంటలు ఓవర్…రికార్డులు చెల్లాచెదురు సామి!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన సలార్(salaar part 1 – ceasefire) అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది, కథ కొంచం కేజిఎఫ్ తో పాటు ఉగ్రం మూవీస్ ని పొలి ఉన్నట్లు అనిపించడం ఒక్కటి మైనస్ కాగా…

ప్రభాస్ షాట్స్, ఎలివేషన్స్ అన్నీ కూడా ట్రైలర్ లో హైలెట్ అవ్వగా ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా యూట్యూబ్ లో సైతం ఈ ట్రైలర్ రికార్డులతో ఊచకోత కోసింది, వ్యూస్ పరంగా టాలీవుడ్ రికార్డులతో పాటు ఏకంగా సౌత్ రికార్డులను కూడా నమోదు చేసిన ఈ ట్రైలర్ లైక్స్ పరంగా మాత్రం టాలీవుడ్ లో…

టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది, టాప్ ప్లేస్ ను జస్ట్ 2 వేల లైక్స్ మార్క్ తో మిస్ చేసుకుంది ఈ ట్రైలర్. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి యూట్యూబ్ లో సలార్ ట్రైలర్ 32.58 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ తో ఆల్ టైం సౌత్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది….

ఇక లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైం కి 1.238 మిలియన్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది, ఇంకో 2 వేల లైక్స్ వచ్చి ఉంటే RRR మూవీ ట్రైలర్ 1.24 మిలియన్స్ లైక్స్ రికార్డ్ బ్రేక్ అయ్యేది. ఓవరాల్ గా రికార్డులను చాలా వరకు చెల్లాచెదురు చేసిన సలార్ ట్రైలర్…

సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో చెప్పకనే చెప్పింది, సినిమా కూడా ఆడియన్స్ ను ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక సలార్ రికార్డుల జాతర మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ నెల ఎండ్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో ఊచకోత కోస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here