Home న్యూస్ భగవంత్ కేసరి: 14.50 కోట్లకు అమ్మితే…నైజాంలో టోటల్ గా వచ్చింది ఇది!!

భగవంత్ కేసరి: 14.50 కోట్లకు అమ్మితే…నైజాంలో టోటల్ గా వచ్చింది ఇది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ చేసుకుని ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా ఒక్కో ఏరియాలో రన్ ఫైనల్ కలెక్షన్స్…..

లెక్కలు బయటికి వస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాల్లో ముందు నిలిచే నైజాం ఏరియాలో ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది సినిమా ఇప్పుడు, నైజాంలో భారీ పోటిలో రిలీజ్ అయిన ఈ సినిమా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

నైజాంలో సినిమాకి టోటల్ గా 14.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా ఈ మార్క్ ని దాటేసిన సినిమా టోటల్ రన్ లో 19 కోట్ల మార్క్ ని దాటేసింది… ఫైనల్ రన్ అయ్యే సరికి 19.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఇక్కడ…

రన్ కంప్లీట్ అయ్యే టైంకి 4.54 కోట్ల రేంజ్ లో లాభాన్ని కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మిగిలిన ఏరియాల్లో కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ లాంగ్ రన్ లో సొంతం అవ్వగా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మీద లాభాలతో పరుగును పూర్తి చేసుకుంది ఈ సినిమా…

Bhagavanth Kesari 8 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here