సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు లేట్ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్నా కూడా మిగిలిన సినిమా ల కన్నా కూడా బెటర్ బజ్ ను క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie)సినిమా….సాంగ్స్ తో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను…
సొంతం చేసుకుని సాలిడ్ క్రేజ్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి.
ట్రైలర్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కానీ, వెంకటేష్ కామిక్ టైమింగ్ అండ్ డైలాగ్స్ ట్రైలర్ లో మంచి హైలెట్స్ గా నిలిచాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కుమ్మేయడంతో ఇక ఓపెనింగ్స్ కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి… వ్యూస్ పరంగా 24 గంటల్లో 12.90 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా..లైక్స్ పరంగా కూడా కుమ్మేసిన ఈ ట్రైలర్ 249.1K లైక్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మరో సీనియర్ హీరో బాలయ్య నటించిన డాకు మహారాజ్ ట్రైలర్ కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఓవరాల్ గా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ రాగా…
వెంకటేష్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ అని కూడా చెప్పొచ్చు…సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుండటం, ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి ఉన్న క్రేజ్ దృశ్యా మినిమమ్ టాక్ వచ్చినా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.