Home న్యూస్ సైంధవ్ OTT రిలీజ్ రెస్పాన్స్….నిజంగానే మైండ్ బ్లాంక్ ఇది!

సైంధవ్ OTT రిలీజ్ రెస్పాన్స్….నిజంగానే మైండ్ బ్లాంక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్(Saindhav Movie) సంక్రాంతికి రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది.

దాంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని ఈ సినిమా చూపించ లేక పోయింది. దాంతో భారీ డిసాస్టర్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచి వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ అండ్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే ముగించుకుని ఇప్పుడు…

Saindhav Movie 2 Days Total WW Collections!

అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి డిజిటల్ లో రెస్పాన్స్ అయినా బాగుంటుంది అనుకున్నా కూడా ఇక్కడ రెస్పాన్స్ అందరికీ మైండ్ బ్లాంక్ చేసేలా ఉందని చెప్పాలి. సినిమాలో విక్టరీ వెంకటేష్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అలాగే నావాజుద్ధీన్ సిద్దిఖి సాలిడ్ విలనిజంలు…

ఆకట్టుకోగా మిగిలిన సినిమా అంతా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేదని విమర్శలు మరో లెవల్ లో వస్తున్నాయి…. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం బాలేదని, యాక్షన్ సీన్స్ అడిరిపోయినా ఏమాత్రం సినిమా అంచనాలను అందుకోలేదు అంటూ మరింత నెగటివ్ రెస్పాన్స్ ని డిజిటల్ లో సొంతం చేసుకుని ఇక్కడ కూడా సినిమా నిరాశ పరిచింది అని చెప్పాలి.

Saindhav Movie 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here